రోహిత్ శర్మ పేరిట ఓ చెత్త రికార్డు...

రోహిత్ శర్మ పేరిట ఓ చెత్త రికార్డు...

టెస్టు ఫార్మాట్‌లో రోహిత్ శర్మ...ఒకే బౌలర్‌ చేతిలో ఆరుసార్లు పెవిలియన్‌ చేరాడు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టులో రోహిత్‌ నిలకడగానే రాణిస్తున్నాడు. అయితే కంగారూ స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ చేతిలో...ఇప్పటి వరకు ఆరుసార్లు ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందు నాథన్‌ లయన్‌ దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబాడతో సమానంగా ఉన్నాడు. అయితే చివరి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో హిట్‌మ్యాన్‌ను పెవిలియన్‌కు పంపడంతో...ఆస్ట్రేలియా స్పిన్నర్‌ రికార్డు నెలకొల్పాడు. మరోవైపు లయన్ మరో మూడు వికెట్లు తీస్తే నాలుగు వందల వికెట్ల క్లబ్ ‌లో చేరనున్నారు.