రోహిత్ రాకపోతే అతని స్థానంలో..?

రోహిత్ రాకపోతే అతని స్థానంలో..?

కరోనా విరామం తర్వాత భారత జట్టు వెళ్లిన ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. వన్డే, టీ20 అనంతరం అడిలైడ్‌లో మొదటి టెస్ట్ డిసెంబర్ 17న ప్రారంభమవుతుంది. అయితే టెస్టు సిరీస్‌లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆడటం అనుమానంగా మారింది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో శిక్షణ పొందుతున్న రోహిత్ టెస్టు సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ ఆసీస్ వెళ్లకపోతే‌ అతని స్థానంలో భారత యువ ఆటగాడు‌ శ్రేయస్‌ అయ్యర్‌ను ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అయ్యర్‌ను రిజర్వ్‌ ఆటగాడిగా తీసుకునే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే అ‍య్యర్..‌ టెస్టుల్లో కూడా అరంగేట్రం చేసేందుకు అవకాశం లభిస్తుంది.