ఇంగ్లీష్ ఆటగాళ్లకు రోహిత్ శర్మ కౌంటర్...
రెండో టెస్టులో ఓటమి తరువాత ఇండియా పిచ్‌లు సరిగా లేవంటూ ఇంగ్లాండ్ క్రికెటర్లు చేస్తున్న విమర్శలకు రోహిత్ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆటగాళ్లు క్రికెట్ గురించి మాట్లాడాలి కానీ.. పిచ్‌ల గురించి కాదంటూ పంచ్ ఇచ్చాడు. తాము విదేశాల్లో పర్యటించినప్పుడు అక్కడి పిచ్‌ల గురించి ఎలాంటి ఫిర్యాదులు చేయమని.. ఆటను ఎంజాయ్ చేస్తామని చెప్పాడు. కఠినమైన పిచ్ ఎదురైతే విఫలమవ్వొచ్చు కానీ.. ఆ పరిస్థితుల నుంచి నేర్చుకునేందుకు ప్రయత్నించాలని ఇంగ్లాండ్ క్రికెటర్లకు హితబోధ చేశాడు. ఇక ఈరెండు జట్ల మధ్య మూడో టెస్ట్ ఈ నెల 24 న ప్రారంభం కానుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)