చెన్నైలో రో'హిట్‌'

చెన్నైలో రో'హిట్‌'

భారత్‌-ఇంగ్లండ్ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతోన్న రెండో టెస్ట్‌లో రోహిత్ శర్మ మరోసారి సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.. ఇంగ్లండ్ బౌలర్లకు విశ్వరూపం చూపించిన రోహిత్.. భారీ స్కోర్ సాధించారు.. 231 బంతులు ఎదుర్కొని 69.69 సగటుతో 161 పరుగులు చేసి టీమిండియాను భారీ స్కోర్ బాటలో నడిపించాడు.. ఇక, తన్న ఇన్పింగ్స్‌లో రెండు సిక్సర్లు బాదిన రోహిత్.. 18 సొగసైన బౌండరీలతో ఆకట్టుకున్నాడు. ఓవైపు మిగతా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమవుతున్నా.. మరోవైపు హిట్ మ్యాన్ రెచ్చిపోయి పరుగులు రాబట్టాడు.. 67  పరుగులు చేసిన రహానే... రోహిత్‌కు మంచి సహకారం అందించాడు.. కాగా, భారత్ ఇన్నింగ్స్ ప్రారంభమైన వెంటనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్(0), కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) డకౌట్‌ గా పెవిలియన్ చేరగా.. చతేశ్వర్ పుజారా (21) కూడా తక్కువ స్కోరుకే ఔట్ అయ్యాడు.. మరోవైపు.. 130 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. తన ఖాతాలో ఏడో టెస్ట్ సెంచరీ వేసుకున్నాడు. ప్రస్తుతం ఆరు వికెట్ట నష్టానికి 290 పరుగుల దగ్గర భారత్ ఇన్సింగ్ సాగుతుండగా.. రిషబ్ పంత్, అక్షర్ పటేల్ క్రీజ్‌లో ఉన్నారు.