వరుసగా 8 ఏడాది కూడా రోహిత్ దే ఆ రికార్డు...

వరుసగా 8 ఏడాది కూడా రోహిత్ దే ఆ రికార్డు...

గాయం కారణంగా భారత స్టార్ ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ కు ఎంపిక కాలేదు, అయిన కూడా ఆ ఫార్మాట్‌ లో  ఓ రికార్డు సాధించాడు హిట్ మ్యాన్. అదేంటంటే.. ఈ ఫార్మాట్ లోని ఒక ఇన్నింగ్స్ లో భారత్ తరపున ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ ఫిట్ సాధించడం రోహిత్ కు వరుసగా ఇది 8వ సారి. అయితే ఈ ఏడాది జనవరి 19న బెంగళూరులో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ చేసిన 119 పరుగులే 2020 లో ఒక భారతీయుడు ఒక ఇన్నింగ్స్ లో సాధించిన అత్యధిక వన్డే స్కోరు. ఆ తర్వాత ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో హార్దిక్ పాండ్యా (92) తో రెండో స్థానంలో నిలిచాడు. అయితే రోహిత్ శర్మ గత 8 సంవత్సరాలుగా సాధించిన ఈ రికార్డులను చూస్తే...
2013 - 209
2014 - 264
2015 - 150
2016 - 171 *
2017 - 208 *
2018 - 152
2019 - 159
2020 - 119