మగువలతో వల.. ఆపై...!

మగువలతో వల.. ఆపై...!

రోడ్డుపై వెళ్తున్న సమయంలో మగువలను చూసి ఆగారంటే అంతే సంగతలు... ఒక మగువే కాదు.. అక్కడ పెద్ద గ్యాంగే ఉంటుంది. మగువను చూసి వాహనం ఆపితే వారి పనిఅయిపోయినట్టే. మగువలతో వల వేసి.. అందినకాడికి దోచుకుంటూ.. చితకబాదుతోన్న ఓ గ్యాంగ్ గుట్టు రట్టైంది. వివరాళ్లికి వెళ్తే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలకేంద్రంలో అర్ధరాత్రి దారి దోపిడీ దొంగలు హల్ చల్ చేస్తున్నారు. రోడ్డుపై వెళ్తున్నవారిని మహిళ సహాయంతో ఆపడం.. ఆపై దోపిడీకి పాల్పడుతున్నారు. ఎదురుతిరిగితే దారుణంగా కొట్టి పంపిస్తున్నారు. తాజాగా ఓ లారీని ఆపి రూ. 10 వేలు లాక్కొని డ్రైవర్, క్లీనర్‌ను చితకబాదిన దుండగులు, మరో కారును ఆపే ప్రయత్నం చేయగా.. తప్పించుకుని స్థానిక పోలీసు స్టేషన్ కు సమాచారం అందించడంతో ఈ వ్యవహారం వెలుగులు చూసింది.