హైదరాబాద్‌-సాగర్‌ హైవేపై ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

హైదరాబాద్‌-సాగర్‌ హైవేపై ఘోర  ప్రమాదం.. 8 మంది మృతి

హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది... నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అంగడిపేట స్టేజ్ దగ్గర ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది... ఈ ఘటనలో అక్కడికక్కడే 8 మంది మృతిచెందారని స్థానికులు చెబుతున్నారు... మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పెద్ద ఆడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజ్ సమీపంలోని పెట్రోల్ బంక్‌ దగ్గర.. జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి... ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జైంది.. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. మృతుల్లో ఆటో డ్రైవర్‌ కూడా ఉన్నాడు.. మృతులను చెన్నంపేట మండలంలోని సుద్దబావితండాకు చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా సమయంలో ఆటోలో 21 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది.