హైదరాబాద్‌లో కుంగిపోయిన రోడ్డు.. భారీ గొయ్యి..

 హైదరాబాద్‌లో కుంగిపోయిన రోడ్డు.. భారీ గొయ్యి..

హైదరాబాద్‌లో ఉన్నట్టుండి ఓ రోడ్డు కుంగిపోయింది... అంతా చూస్తుండగానే రోడ్డు కుంగిపోయి.. భారీ గొయ్యి ఏర్పడింది... కుషాయిగూడలోని ఏ.ఎస్ రావు నగర్‌లో ఈ ఘటన జరిగింది.. ఇవాళ సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు, జనం చూస్తుడగానే క్రమంగా లోపలికి కుంగిపోయింది రోడ్డు. ఇక, రోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడటంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు.. కుషాయిగూడ లా అండ్ ఆర్డర్ పోలీసులు.. వాహనదారులు ప్రమాదానికి గురి కాకుండా చర్యలు చేపట్టారు.. ఆ రోడ్డులో వాహనాలు వెళ్లకుండా ట్రాఫిక్ మళ్లించారు. ఇక, ఘటన స్థలానికి చేసురుకున్న జీహెచ్ఎంసీ అధికారులు... కుంగిపోయిన రోడ్డును రిపేర్ చేసే పనిలో పడిపోయారు. ఇక, ఆ సమయంలో వర్షం కురవకపోవడం.. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. కాగా, మరోవైపు.. భారీ వర్షాలతో హైదరాబాద్‌లో పలు రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి.