శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

హైద‌రాబాద్ శివారులోని శంషాబాద్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది... ఈ ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే ఆరుగురు మృతిచెంద‌గా.. మ‌రో ఆరుగురు లారీ కింద చిక్కుకున్నారు.. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది.. కారును ఢీకొన్న లారీ బోల్తా ప‌డ‌డంతో.. అక్క‌డిక‌క్క‌డే ఆరుగురు మృతిచెందారు.. మ‌రో 15 మందికి గాయాల‌య్యాయి.. ప్ర‌మాద స‌మ‌యంలో లారీలో మొత్తం 30 మంది కూలీలు ప్ర‌యాణం చేస్తున్నారు.. మ‌రో ఆరుగురు లారీ కింద చిక్కుకోవ‌డంతో వారిని బ‌య‌ట‌కు తీసి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు పోలీసులు. క్ష‌త‌గాత్రుల రోధ‌న‌ల‌తో ఘ‌ట‌నాస్థ‌లం శోక‌సంద్రంగా మారింది.