మరో మంత్రిని టార్గెట్ చేసిన తేజస్వి యాదవ్... 

మరో మంత్రిని టార్గెట్ చేసిన తేజస్వి యాదవ్... 

బీహార్ లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.  నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.  ముఖ్యమంత్రిగా ఎంపికయ్యాక అయన మంత్రివర్గంలోని మంత్రులపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కన్నేశారు.  మంత్రులు చేస్తున్న తప్పులను పట్టుకొని ట్విట్టర్ ద్వారా వైరల్ చేస్తున్నారు.  ఇలానే జాతీయ గీతాన్ని తప్పుగా పాడిన మంత్రి మేవాలాల్ పై విమర్శలు చేశారు.  మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 48 గంటల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది.  కాగా, ఇప్పుడు తేజస్వి యాదవ్ మరో జెడియు నేత, మంత్రి అశోక్ చౌధురిని టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కి అత్యంత సన్నిహితుడు, జెడియు కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి అశోక్ చౌధురిపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.  "బ్యాంకులను మోసం చేశారని, ఫోర్జరీతో బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారని, ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు జరుగుతుందని అయన కుటుంబసభ్యులపై ఆరోపణలు ఉన్నాయని, అశోక్ చౌధురి భార్యపై సీబీఐ దర్యాప్తు జరుగుతుందని, అయినప్పటికీ అవేమి పెద్ద విషయాలు కాదని జేడీయు అంటోందని" తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు.  తేజస్వి యాదవ్ వ్యాఖ్యలను మంత్రి అశోక్ చౌధురి తిప్పికొట్టారు.