నన్ను చంపుతామంటూ బెదిరిస్తున్నారు: రియా

నన్ను చంపుతామంటూ బెదిరిస్తున్నారు: రియా

బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్‌ బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను పరిశీలించిన పోలీసులకు కీలక వివరాలు లభ్యమయ్యాయి. తన గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి విమాన టికెట్లు, హోటల్‌ ఖర్చులను సుశాంత్‌ భరించాడని వెల్లడైంది. రియా సోదరుడి ఖర్చులు కూడా సుశాంత్‌ భరించాడని బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లో తేలింది. తన కొడుకు చనిపోవడానికి రియా కారణమని సుశాంత్ తండ్రి కెకె సింగ్ పోలీస్ కేసు ఇచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్ తండ్రి పేర్కొన్న ఆరోపణలు భరించలేక ఎదురుదాడిని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తన లాయర్ సతీష్ మానేషిండే సమక్షంలో పాట్నాలో సుశాంత్ తండ్రి పెట్టిన కేసును ముంబైకి బదిలీ చేయాలని సుప్రీం కోర్టును కోరింది రియా. ఆమె మాట్లాడుతూ.. నాతో పాటు మరో ఆరుగురు కలిసి సుశాంత్ ని సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించినట్లు చేసిన అభియోగం పూర్తి అవాస్తవం. నాపై లేనిపోని అభియోగాలు మోపడంతో నాకు ప్రాణహాని కలిగింది. నన్ను ఎవరో నాకు తెలియని వారు బెదిరిస్తున్నారు. రేప్ చేస్తానంటూ , చంపేస్తాం  అంటూ బెదిరిస్తున్నారు అని వాపోయింది రియా. ఇదిలా ఉండగా.. సుశాంత్ తండ్రి పెట్టిన కేసు వలన తనకు ప్రాణహాని ఉందని ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్లో రియా చక్రవర్తి కేసు పెట్టింది.