వైరల్ అవుతున్న రిషబ్ పంత్ పాత ఫోటో...
టీమిండియా విధ్వంసకర ఆటగాడు రిషబ్ పంత్‌కు చెందిన ఓ పాత ఫోటోగ్రాఫ్ వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో పంత్ భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా ఆటోగ్రాఫ్ తీసుకుంటూ కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. గతంలో కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా అచ్చం ఇలానే ఆశిష్ నెహ్రాతో ఆటోగ్రాఫ్ తీసుకుంటూ కనిపించాడు. ఈ రెండు ఫోటోలను పోలుస్తూ సోషల్ మీడియాలో పెద్ద డిస్కషనే నడుస్తోంది. కోహ్లి, పంత్‌ల సక్సెస్‌కు నెహ్రా ఆటోగ్రాఫే కారణమని కొందరంటుంటే.. మరి కొందరేమో నెహ్రా హస్తవాసి చాలా బాగుందని.. ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుంటే క్రికెటర్లు స్టార్లయిపోతారని కామెంట్లు చేస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)