పన్ను కట్టకుంటే... తొలిరోజు రాత్రి వారితో గడపాలి...!!

పన్ను కట్టకుంటే... తొలిరోజు రాత్రి వారితో గడపాలి...!!

ఇప్పుడంటే రాజ్యాలు లేవు... రాజులు లేరు... కానీ పన్నులు ఉన్నాయి.  ప్రభుత్వానికి తప్పనిసరిగా పన్నులు కట్టాలి.  పన్ను కట్టకుంటే దాని వలన చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో తప్పనిసరిగా పన్నులు కట్టాలి.  అది వస్తువుతో పాటుగా పన్నులు ఉంటాయి కాబట్టి మనకు తెలియకుండానే పన్నులు విధిస్తారు.  

పన్నులు అన్నవి ఇప్పటివి కాదు.  ఎన్నో శతాబ్దాల తరబడి వస్తున్నవే.  అప్పట్లో రాజులకు శిస్తు కట్టేవారు.  ఆ పన్నుల నుంచే రాజులు పరిపాలన సాగించేవారు.  రాజుల కింద కొంతమంది సామంత రాజులు ఉండేవారు.  సామంత రాజులు తమ రాజ్యంలో కలెక్ట్ చేసిన పన్నును రాజులకు కట్టేవారు.  1280 సంవత్సరంలో స్కాట్లాండ్ ను పరిపాలిస్తున్న అలెక్స్ మరణించడంతో వారసులు లేకపోవడంతో దానిని తనకు అనుకూలంగా మార్చుకొని స్కాట్లాండ్ ను ఆక్రమించుకోవాలని చూస్తాడు ఇంగ్లాండ్ రాజు ఎడ్వర్డ్.  

సామంత రాజులను సమావేశానికి పిలిచి హత్య చేయిస్తారు.  ఆ సమయంలో ఎలెన్ అనే వ్యక్తి కూడా అక్కడే ఉంటాడు.  ఈ విషయం తన తండ్రి, అన్నకు చెప్పి ఇంగ్లాండ్ రాజుపై యుద్ధం చేయాలని చూస్తారు.  ఎలెన్ కు పొలం పనులు అప్పగించి తండ్రి, అన్నలు రాజుపై యుద్దానికి వెళ్తారు.  ఆ యుద్ధంలో అన్న, తండ్రి మరణిస్తారు.  కొన్నాళ్ల తరువాత ఎలెన్ స్కాట్లాండ్ లోని తన ప్రాంతానికి వెళ్లి చూసి షాక్ అవుతాడు.  అక్కడ ఓ చట్టం అమలులో ఉంటుంది.  వివాహ పన్ను కట్టకుండా పెళ్లి చేసుకుంటే వధువు తొలిరాత్రి సామంత రాజు లేదా రాజుతో గడపాలి.  దీనిని ఎలెన్ తప్పుపడతాడు.  చిన్ననాటి స్నేహితురాలిని రహస్యంగా వివాహం చేసుకుంటాడు.  కానీ, ఆ విషయం బయటకు తెలియడంతో ఎలెన్ భార్యను చంపేస్తారు.  దీంతో ఎలెన్ ఇంగ్లాండ్ రాజుపై యుద్ధం ప్రకటిస్తాడు.  ఆ యుద్ధంలో చివరకు ఎలెన్ ప్రాణాలు కోల్పోతాడు.