వారితో ఓడిపోవడం సిగ్గుచేటు : పాంటింగ్
ఆసీస్ సిరీస్ లో దాదాపు భారత స్టార్ ఆటగాళ్లు అందరూ గాయాల కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై రికీ పాంటింగ్ మాట్లాడుతూ... ప్రధాన ఆటగాళ్లు లేకుండానే యువ బౌలర్లతో మ్యాచ్ ఆడిన భారత్.. గబ్బాలో విజయం సాధించడం నమ్మలేకపోతున్నా అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. కీలక ఆటగాళ్లు దూరమైనా తర్వాత ఆడిన టీమిండియా 'ఏ' చేతిలో ఓడిపోవడం సిగ్గుచేటు అన్నాడు. స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్.. ప్రధాన పేసర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్‌తో పటిష్ఠంగా ఉన్న ఆసీస్.. స్వదేశంలో ఓటమిపాలవ్వడం నమ్మలేకపోతున్నాను అని తెలిపాడు. ఈ సిరీస్ లో టీమిండియా పరిస్థితి చూస్తే.. కెప్టెన్ విరాట్ కోహ్లీ లేడు, గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. సిరీస్‌ను దాదాపు 20 మంది ఆటగాళ్లతో ఆడారు. మరోవైపు ఆస్ట్రేలియా ఎంతో పటిష్ఠంగా ఉంది. అయినా ఓటమి పాలవ్వడం ఎంతో కష్టంగా ఉంది. ప్రతి టెస్టులో కీలకమైన సమయాల్లో టీమిండియానే పైచేయి సాధించింది. కానీ ఆస్ట్రేలియా సాధించలేకపోయింది. రెండు జట్ల మధ్య ఉన్న తేడా ఇదే. భారత్ గొప్పగా ఆడింది. విజయానికి వారే అర్హులు' అని అన్నాడు. అయితే టెస్టులో టీమిండియా ఓటమిపాలైన తర్వాత రికీ పాంటింగ్ టీమిండియాను తక్కువగా అంచనా వేసాడు. కానీ ఇప్పుడు తన మాటను మార్చుకున్నాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)