రహానే ఉండటం అనుమానమే : పాంటింగ్

రహానే ఉండటం అనుమానమే : పాంటింగ్

దుబాయ్‌ వేదికగా ఈ రోజు ఐపీఎల్ 2020 లోని రెండో మ్యాచ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు తాజాగా ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ తన ఆటగాళ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు, భారత బ్యాట్స్మాన్ అజింక్య రహానె ఈ ఆటలో తుది జట్టులో ఉండటం అనుమానమే అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రహానేను తుది జట్టులోకి తీసుకోవడం పై మిశ్రమ ఆలోచనలు ఉన్నాయని అందువల్ల టాసుకు ముందే జట్టులో తన స్థానం పై తుది పిలుపునిస్తానని చెప్పాడు. ఐపీఎల్‌లో గత సీజన్లలో రెగ్యులర్ ఓపెనర్‌గా ఉన్న అజింక్య రహానేను రాజస్థాన్ రాయల్స్ నుండి ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఢిల్లీ తీసుకుంది. కానీ ఢిల్లీ జట్టులో ఇప్పటికే పృథ్వీ షా మరియు శిఖర్ ధావన్ రూపంలో అద్భుతమైన ఓపెనర్ బ్యాట్స్మెన్లు ఉన్నారు. అందువల్ల రహానేకు అవకాశం లేదు. అయితే, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లతో పాటు మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయడానికి అతన్ని ఉపయోగించవచ్చు అని పాంటింగ్ చెప్పాడు. చుడాలి మరి రహానే ఈ రోజు ఢిల్లీ తుది జట్టులో ఉంటాడా... లేదా అనేది.