ఫిలిం స్కూల్‌ ప్రారంభించిన ఆర్జీవీ

ఫిలిం స్కూల్‌ ప్రారంభించిన ఆర్జీవీ

ఇండియన్ ఫిలిం మేకర్స్ లో రామ్ గోపాల్ వర్మకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆయన మొదటి సినిమా శివ మొదలుకుని నేటి ఆఫీసర్ వరకు ప్రతిది డిఫెరెంట్ టేకింగ్ తోనే చేశారు. ఫిలిం మేకింగ్ టెక్నీక్స్ వర్మ దగ్గర ఉన్నట్లుగా ఎవరి దగ్గర ఉండవు అనేది జగమెరిగిన సత్యం. వర్మ మొదట్నుంచి టెక్నాలజీని బాగా ఫాలో అవుతుంటాడు. అందుకే తన సినిమాల్లో సినిమాటోగ్రఫీ అంత వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పుడు అసలైన మేటర్ ఏంటంటే త్వరలోనే వర్మ గారు ఓ ఫిలిం స్కూల్ ఓపెన్ చేయబోతున్నారు. 

తాజాగా వర్మ తన ట్విట్టర్ ద్వారా న్యూ యార్క్ కు చెందిన రామ్ స్వరూప్, శ్వేతా రెడ్డిలతో కలిసి నేను ఓ ఫిలిం స్కూల్ మొదలెట్టబోతున్నాను. దాని పేరు RGV UNSCHOOL. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రేపు ప్రెస్ మీట్ లో వెల్లడిస్తాను అని తెలిపారు. దీనికి సంబంధించి ఓ లోగోను కూడా రిలీజ్ చేయడం విశేషం. ఇది రాబోయే ఫిలిం మేకర్స్ కు చాల మంచి విషయమే. ఎంతో మంది ఆర్జీవీ దగ్గర పనిచేయాలని కలలు కనే వారికీ ఇదొక సువర్ణావకాశమే. ఇక వర్మ సినిమాల గురించి మాట్లాడుకుంటే తాజాగానే నాగార్జునతో పోలీస్ థ్రిల్లర్ ఆఫీసర్ సినిమాను తెరకెక్కించాడు. జూన్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.