ఏపీ అసెంబ్లీలోకి ప్రవేశంపై ఆంక్షలు..

ఏపీ అసెంబ్లీలోకి ప్రవేశంపై ఆంక్షలు..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పరసరాల్లో ప్రవేశంపై ఆంక్షలు విధించారు అధికారులు... సచివాలయం నుంచి అసెంబ్లీలోకి ఉద్యోగులు, సిబ్బంది రాకుండా నిషేధించిన అధికారులు... అసెంబ్లీ ఉద్యోగుల రాకపోకల పైనా ఆంక్షలు పెట్టారు... గేట్ నెంబర్ 2 నుంచి మాత్రమే రావాలని ఆదేశించారు. ఆధార్ కార్డ్‌తో పేరు నమోదు చేసుకుంటేనే అసెంబ్లీలోకి ప్రవేశం అనే నిబంధనలు పెట్టారు. శాసనసభాపక్ష కార్యాలయాల్లో ఎమ్మెల్యేలకు మీడియా సమావేశాలు కూడా నిరాకరింస్తూ ఆదేశాలు జారీ చేశారు. స్పీకర్ కోడెల ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు మీడియా సమావేశాలు కూడా పెట్టకుండా అమలు చేస్తున్నామని అసెంబ్లీ కార్యదర్శి విజయ రాజు ప్రకటించారు.