నెల్లూరు జిల్లాలో వినాయకచవితిపై ఆంక్షలు... 

నెల్లూరు జిల్లాలో వినాయకచవితిపై ఆంక్షలు... 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.  మామూలు రోజుల్లో వినాయక చవితి వేడుకలను ఏ విధంగా నిర్వహిస్తారో చెప్పక్కర్లేదు.  వాడవాడలా మండపాలు కట్టి వినాయక విగ్రహాలు పెడతారు.  కరోనా కారణంగా ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేలా కనిపించడం లేదు.  నెల్లూరు జిల్లాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలపై పోలీసు అధికారులు ఆంక్షలు విధించారు.  వినాయక చవితి వేడుకలను ఎవరింట్లో వారే నిర్వహించుకోవాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.