స్కూళ్లు, కాలేజీల ప్రారంభం మళ్లీ వాయిదా... ఏపీలో ఎప్పటి నుంచంటే..?

స్కూళ్లు, కాలేజీల ప్రారంభం మళ్లీ వాయిదా... ఏపీలో ఎప్పటి నుంచంటే..?

కరోనా స్కూళ్ల ప్రారంభంపై తీవ్ర ప్రభావమే చూపింది.. ఇక, ఎడ్యుకేషన్ ఇయర్ కూడా కోల్పోయే ప్రమాదం ఉండడంతో పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఇదే సమయంలో ఆన్‌లైన్ తరగతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఆ తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు అనుమతి ఇస్తే.. స్కూళ్లకు కూడా పపించేందుకు కొన్ని తరగతుల విద్యార్థులకు అనుమతి ఇచ్చారు. ఇదే సమయంలో.. ఏపీలో స్కూల్స్‌ పునర్‌ప్రారంభం మరో సారి వాయిదా పడింది... సెప్టెంబర్ 5వ తేదీన స్కూల్స్ ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది.. కానీ, కేంద్రం అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో.. అక్టోబర్‌ 5న విద్యాసంస్థలు ప్రారంభించాలని భావించారు. మళ్లీ ఏమైందో కానీ, ఈ సారి నవంబర్ 2వ తేదీకి వాయిదా వేశారు.. నవంబర్ 2వ తేదీన స్కూళ్లు, కాలేజీలు తెరవాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. అయితే అక్టోబర్‌ 5న జగనన్న విద్యా కానుక పథకాన్ని మాత్రం ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా అక్టోబర్‌ 5న విద్యార్ధులకు కిట్లు అందజేయనున్నారు. ఇక, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. ఏదో ఒక ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లి ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు.