జియో మరో సంచలనం.. త్వరలోనే..!

జియో మరో సంచలనం.. త్వరలోనే..!

రిలయన్స్ జియో మరోమారు మార్కెట్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. 4జీ ఫీచర్ ఫోన్లతో ఓ ఊపు ఊపిన జియో.. ఈసారి అతి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లను అందించేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం దేశీయ స్మార్ట్‌ఫోన్ మేకర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే రెండేళ్లలో 200 మిలియన్ స్మార్ట్‌ఫోన్లు ఉత్పత్తి చేసేందుకు రెడీ కావాలంటూ స్థానిక ఫోన్ మేకర్లను కోరినట్టు సమాచారం. గూగుల్ ఆండ్రాయిడ్‌పై పనిచేసేలా 4 వేలకే అందుబాటులో ఉండేలా ఈ స్మార్ట్‌ఫోన్లను సిద్ధం చేయాలని మేకర్లను జియో కోరింది. రిలయన్స్ జియో లోకాస్ట్ వైర్‌లెస్ ప్లాన్ల ద్వారా ఈ ఫోన్లను మార్కెట్ చేయనున్నారు. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ వైర్‌లెస్ సేవల్లో చేసినట్లుగానే దేశంలోని స్మార్ట్‌ఫోన్ పరిశ్రమను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశీయ తయారీని నిర్మించాలన్న భారత ప్రభుత్వ ప్రణాళికలతో భాగస్వాములైన అంబానీ.. డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా, లావా ఇంటర్నేషనల్ మరియు కార్బన్ మొబైల్స్ వంటి వారితో కలిసి పనిచేయనున్నారు.