జియోలో పెట్టుబడులు ఏవరికి లాభం?..భారత్‌లో దాని ప్రభావం.

 జియోలో పెట్టుబడులు ఏవరికి లాభం?..భారత్‌లో దాని ప్రభావం.

రెండు సామ్రాజ్యవాద సంస్ధలు కలిస్తే ఏ పాటి విధ్వంసం జరుగుతుంది? ఆ పెట్టుబడి దారులు విడివిడిగా చేయగల విధ్వంసం కంటే ఇంకా ఎక్కువగా విధ్వంసం జరుగుతుంది. ఇద్దరు కార్మికులు విడి విడిగా పని చేసినప్పటి కంటే సమిష్టిగా పని చేసినప్పటి ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. రాకాసితనం కూడా అంతే అన్నమాట! నిజానికి బహుళజాతి కంపెనీలలో పెట్టుబడులు పెట్టేది లేదా విలీనయం అయేది, స్వాధీనం చేసుకునేది కూడా వారి లాభాలను  పెంచుకునేందుకే!  

దేశీయ కంపెనీ అయినా జియోలో గత కొద్ది కాలంలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుంది..రిలయన్స్ జియోలో ఏప్రిల్ 22న ఫేసే బుక్,మే 4న సిల్వర్ లేక్ పార్ట్ ‌నర్స్ ,మే 8న విస్టా ఈక్విటీ పార్ట్ నర్స్ 750 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి 2.32 శాతం షేర్లు కొనుగోలు చేసింది..ఇప్పుడు సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ వాటాలు కొనుగోలు చేయాలిని ప్రయ్నాలు కొనసాగిస్తుంది..

అ బహుళజాతి రాక్షస కంపెనీలు జియోలో వాటాలను ప్రకటించడంతో ప్రపంచ వ్యాపితంగా, ముఖ్యంగా భారత దేశ వ్యాపార రంగానికి మరిన్ని గడ్డు రోజులు రానున్నాయి..

దీనిని  వాటాలు కొనుగోలు అనటం కంటే భారత దేశీయ వ్యాపారాన్ని స్వాధీనం (అక్విజిషన్) అనడమే కరెక్ట్. ఎందుకంటే  రిలయన్స్ జియో సంస్థ కేవలం మూడు వారాల్లోనే రూ.60,596కోట్ల నిధులను సమీకరించింది...కేవలం నాలుగు సంస్థలు మాత్రమే పెట్టుబడులు పెట్టడంతో భారత వ్యాపారంను ఎక్కువ శాతం కైవాసం చేసుకుంటుంది..

జియోలో ఈ నాలుగు కంపెనీలు పెట్టడం  ద్వారా గ్లోబల్ మార్కెట్ ని స్ధిరీకరించుకోగల (మార్కెట్ కన్సాలిడేషన్) శక్తి వీటికి వచ్చింది... ఇండియాలో చాలా వరకు కమ్యూనికేషన్‌ మార్కెట్ ప్రధానంగా రిలయన్స్‌, జియో కంపెనీ చేతుల్లోనే ఉన్నది. జియోలో ప్రజల పేర్లు వినిపించినప్పటికీ వాటిని కూడా కంపెనీయే కంట్రోల్ చేస్తోంది... తద్వారా మార్కెట్ లో అనేక వెరైటీలు ఉన్న భ్రమలను కలిగిస్తుంది...

ఇండియాలోని జియో కంపెనీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా భారత్ లోకి విదేశీ కంపెనీలు ఆనతి కాలం లోనే, భారత ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధ్వంసక ఆర్ధిక సంస్కరణల విధానాలు ఆలంబనగా, మార్కెట్ ను కైవసం చేసుకునే ప్రమాదం ఉంది.... భారతీయ దేశీయ కంపెనీ అయినా బీఎస్‌ఎన్‌లును ఇప్పటికే దెబ్బ తీశాయి... దానితో భారతీయులకు కమ్యూనికేషన్‌ కావాలంటే జియో,అందులో ప్రధాన వాటాలను స్వాధీనం చేసుకున్న విదేశీ కంపెనీలు తప్ప మరో గతి లేకుండా పోతుంది...

జియోలో విదేశీ కంపెనీల వాటాలు పెరగడం వల్ల భారతీయుల శ్రమ శక్తి,సామాన్య ప్రజల వాటాలతో నిర్మిణమైన దేశీయ కంపెనీ జియో మరింత శక్తిని,తన ప్రభావాన్ని కొల్పోయే ప్రమాదం కూడా ఉంది...దేశీయ లక్ష్యాలకు వ్యతిరేకంగా విదేశీ కంపెనీల లాభాలు లక్ష్యంగా పనిచేస్తుంది..

ప్రపంచ స్ధాయి మార్కెట్ వాటాల అమ్మకాలు జరిగినపుడు దేశీయంగా ఉండే చిన్న స్ధాయి కంపెనీల మార్కెట్ మరింతగా కుచించుకుపోతుంది...జియోలో  విదేశీ కంపెనీల వాటాలు పెరగడం వల్ల భారత టెలికం రంగాలకు,ముఖ్యంగా ప్రభుత్వం టెలికం రంగాలకు మరింత గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటారు... బహుళజాతి కంపెనీలు పోటీ పడుతున్నపుడే పరస్పర అవగాహన ద్వారా దేశీయ కంపెనీలకు వివిధ రకాలుగా నష్టం జరుగుతుంది...వాటాలు కొనుగొలు జరిగి కంపెనీల మధ్య స్పరస్పరం పోటీ లేకుండా పోతే పరిస్ధితి మరింత దిగజారడం ఖాయం...

ఒప్పందాల ద్వారా ఏర్పడిన ఏకీకృత కంపెనీ ఇండియాలో టెలికం, కమ్యూనికేష్ మార్కెట్ లో దాదాపు పూర్తిగా గుత్త స్వామ్యం వహిస్తుంది... కంపెనీలకు ఇండియాలో ఉన్న అనుబంధ కంపెనీలు, ఉమ్మడి కంపెనీల ద్వారా మార్కెట్ లో మెజారిటీ వాటా కైవసం చేసుకుంటుంది...“ఇది శక్తి ఒకే చోట కేంద్రీకృతం కావటానికి దారి తీస్తుంది. మార్కెట్ మళ్లింపుకు దారి తీస్తుంది. ఇటీవల కాలంలో భారీ సంఖ్యలో  కంపెనీలు విలీనం కావటం ఎక్కువ జరుగుతున్నాయి... దీనివల్ల గ్లోబల్ మార్కెట్ లో 4 కంపెనీలు మాత్రమే మిగులుతాయి.

జియోలో పెట్టుబడులు పెరగడం వల్ల దేశీయ కంపెనీలపై పెద్ద ప్రభావం ఉండబోదని ఉండబోదని సమర్ధకులు వాదిస్తున్నారు...ఆ బహుళజాతి కంపెనీ షేర్లు కొని లాభపడేవారికి మాత్రమే ఈ వాదన నచ్చుతుంది. కానీ బలం పెరిగినపుడు కళ్ళు నెత్తి మీదికి వస్తాయన్నది సాధారణ విషయం. బహుళజాతి కంపెనీల బలం పెరిగినపుడు మార్కెట్ ఎలా నడవాలి శాసించడం మొదలు పెడతాయన్నది అందరికి తెలిసిన సత్యం...

“అవి దోపిడీగా మారుతున్న కంపెనీలు. వాటి దృష్టి ఎప్పుడు పోటీని రూపుమాపి లాభాలు పెంచుకోవడం పైనే ఉంటుంది. అది కూడా దేశంలోని సామాన్య ప్రజలు, వారి భవిష్యత్తును ఫణంగా పెట్టి దోపిడీ చేస్తాయి...