బాక్సర్ ‘గని’ రిలీజ్ డేట్ అనౌన్స్

బాక్సర్ ‘గని’ రిలీజ్ డేట్ అనౌన్స్

మెగా హీరో వరుణ్ తేజ్ సమ్మర్ సినిమా పోటీలో నుంచి తప్పుకున్నాడు. సమ్మర్ లో సినిమాల తాకిడి ఎక్కువగా ఉండటంతో పాటుగా, మెగా హీరోల సినిమాలు కూడా ‘క్యూ’ కట్టుకొని ఉన్నాయి. దింతో వరుణ్ తేజ్ ‘గని’ సినిమా జూలై నెలలోకి వెళ్ళిపోయింది. తాజాగా ‘గని’ విడుదల తేదీని పోస్టర్ ద్వారా తెలియజేసింది చిత్రయూనిట్. జూలై 30వ తేదీన థియేటర్లోకి రాబోతున్నట్లు తెలిపారు. ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేప‌థ్యంలో రూపొందుతుంది. వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ నటిస్తుండగా,   ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.