విరాటపర్వం రిలీజ్ డేట్ ఫిక్స్

విరాటపర్వం రిలీజ్ డేట్ ఫిక్స్

రానా దగ్గుపాటి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా విరాటపర్వం. ఈ సినిమా కామ్రాడ్ రవన్న జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రవన్న పాత్రలో రానా కనిపించనున్నాడు. ఈ సినిమాను వేణు ఊడుగుల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. విరాటపర్వం సినిమా ఈ ఏడాది ఏప్రిల్30న థియేటర్లలో విడుదల అవుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో  ప్రియమణి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్లు, పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మేకర్స్ బిజీగా ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి అయిన వెంటనే సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి వారిని రానా ఏ మాత్రం అలరిస్తాడో వేచి చూడాలి.