లెస్బియన్ పాత్రలో రెజీనా !

లెస్బియన్ పాత్రలో రెజీనా !

ఒకప్పుడు తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న  రెజీనా కసాండ్ర ప్రస్తుతం 'ఏక్ లడకీ కొ దేఖా తో ఐసా లగా' అనే హిందీ సినిమా చేస్తోంది.  ఇందులో సోనమ్ కపూర్ ప్రధాన పాత్రదారి.  ఇందులో సోనమ్ కపూర్ ప్రేయసిగా రెజీనా కనిపిస్తుందట.  అవును.. నిజమే.. ఈ కథలో సోనమ్, రెజీనా ఇద్దరూ లెస్బియన్స్ అని, వారి మధ్య ప్రేమ కథే ఈ సినిమాకు హైలెట్ అని తెలుస్తోంది.  ట్రైలర్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.  షెల్లీ చోప్రా ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 1న  రిలీజ్ చేయనున్నారు.