నాలుగో టెస్టులో కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే...

నాలుగో టెస్టులో కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే...

మొతేరాలో జరిగే ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ జట్లు నాలుగో టెస్టు ఆడుతున్నాయి. అయితే విజయం లేదా డ్రా లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. అలా అయితేనే వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో చోటు దక్కుతుంది. మూడో టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో ఇక్కడి వికెట్‌పై విమర్శలు వచ్చినా కోహ్లీ సేన మాత్రం తమ దృష్టంతా ఇప్పుడు మ్యాచ్‌పైనే నిలిచింది. 

ఇక ఆఖరి టెస్ట్ లో మరిన్ని రికార్డులపై కన్నేశాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. భారత్‌ తరఫున అత్యధిక టెస్టులకు కెప్టెన్సీ వహించిన ఎంఎస్ ధోనీ  రికార్డును అహ్మదాబాద్‌లో కోహ్లీ సమం చేయనున్నాడు.  కెప్టెన్‌గానే కాదు బ్యాట్స్‌మన్‌గా కూడా కొన్ని రికార్డులు కోహ్లీ ముంగిట ఉన్నాయి. విరాట్ మరో 17 పరుగులు చేస్తే.. కెప్టెన్‌గా 12 వేల  అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకుంటాడు. కోహ్లీ కన్నా ముందు రికీ పాంటింగ్‌ , గ్రేమ్‌ స్మిత్‌ మాత్రమే ఈ ఘనత సాధించారు.  సెంచరీ చేస్తే కెప్టెన్‌గా అత్యధిక శతకాలు సాధించిన సారథిగా రికీ పాంటింగ్‌ను విరాట్‌ కోహ్లీ దాటేస్తాడు.

ఇక నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. అత్యధిక విజయాలు సాధించిన టెస్టు సారథుల్లో గ్రేమ్‌ స్మిత్‌ , రికీ పాంటింగ్‌, స్టీవ్‌ వాల తర్వాతి స్థానంలో ఉన్న క్లైవ్‌ లాయిడ్‌ ను విరాట్‌ సమం చేస్తాడు. నాలుగో టెస్ట్ ద్వారా కోహ్లీ కచ్చితంగా ఓ రెండు రికార్డులను మాత్రం అందుకోనున్నాడు.