స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న డార్లింగ్

స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న డార్లింగ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో భారీ బడ్జెట్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. వరుసగా సినిమాలను అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ను సర్పరైజ్ చేశారు డార్లింగ్. ఇక ప్రస్తుతం రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న 'రాధేశ్యామ్' సినిమాను పూర్తి చేయనున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో అందాల పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత తానాజీ సినిమా దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు.  బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణ్ గా కనిపించనున్నాడు. ప్రభాస్ ప్రతీ సినిమాకు కూడా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా సినిమాకు తగ్గట్టు లుక్స్ లో చాలా చేంజెస్ చేస్తూ ఉంటాడు. ఇక ప్రభాస్ లుక్స్ కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటారు. తాజాగా డార్లింగ్ స్టైలిష్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ట్రెండీ డ్రెస్ లో బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని కూర్చొని డార్లింగ్ ఇచ్చిన పోజ్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.ఈ లుక్ ను అభిమానులు షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్ పై మీరు ఓ లుక్కేయండి .