'మహర్షి' వాయిదాకు ప్రధాన కారణం !

'మహర్షి' వాయిదాకు ప్రధాన కారణం !

మహేష్ బాబు యొక్క 'మహర్షి' చిత్రం మే 9కి వాయిదాపడిన సంగతి తెలిసిందే.  దీంతో అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు.  కానీ ఈ వాయిదా వెనుక జెన్యూన్ రీజన్ ఉంది.  గతేడాది విదేశాల్లో జరపాల్సిన ఒక షెడ్యూల్ వీసా ప్రాసెసింగ్ కారణంగా నెల రోజులు ఆలస్యమైంది.  అందుకే తర్వాతి షెడ్యూల్స్ జారాల్సిన సమయానికి జరగలేదు.  

దీంతో అనుకున్న సమయానికి షూట్ ముగియలేదు.  ఇంకో రెండు పాటలు, అబుదాబిలో షెడ్యూల్ షూట్ చేయాల్సి ఉంది.  అందుకే సినిమా వాయిదా అని, మే 9నాడు తప్పకుండా విడుదలవుతుందని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.  పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు.