సూపర్ ఓవర్లో ఆర్సీబి సూపర్ విజయం... 

సూపర్ ఓవర్లో ఆర్సీబి సూపర్ విజయం... 

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు చిరస్మరణీయమైన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లను 201 పరుగులు చేసింది.  డివిలియర్స్ 55, పించ్ 52, పడిక్కల్ 54 పరుగులు చేయడంతో ఈ స్కోర్ సాధించింది.  202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో పడింది.  ఏ దిశలో కూడా ముంబై జట్టు గెలుస్తుందని అనుకోలేదు.  కనీసం స్కోర్ 150 కూడా దాటుతుందా అనుకున్నారు.  కానీ, అనూహ్యంగా మ్యాచ్ లో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్ చెలరేగి ఆడాడు.  58 బంతుల్లో 99 పరుగులు చేసి బెంగళూరుకు చుక్కలు చూపించాడు.  అటు పోలార్డ్ కూడా తనదైన శైలిలో చెలరేగి ఆడాడు.  పోలార్డ్ 60 పరుగులు చేయడంతో ముంబై జట్టు కూడా 201 పరుగులు చేసింది.  దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ అవసరం అయ్యింది.  సూపర్ ఓవర్ లో ముంబై జట్టు కేవలం 7 పరుగులు మాత్రమే చేసింది.  అయితే, బెంగళూరు సూపర్ ఓవర్ లో 8 పరుగులు చేయడంతో విజయం సాధించింది.