కోహ్లీ అల్లరి మాములుగా లేదుగా...!

కోహ్లీ అల్లరి మాములుగా లేదుగా...!

భారత్ లో కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో ఐపీఎల్ 2020 ని యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది బీసీసీఐ. అయితే ఈ లీగ్ ప్రారంభానికి ఇంకా 6 రోజులు మాత్రమే ఉంది. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత క్వారంటైన్ లో ఉండి శిక్షణ ప్రారంభించడం కోసం అన్ని జట్లతో పాటుగా  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా నెల ముందే దుబాయ్ చేరుకుంది. ఇప్పటికే క్వారంటైన్ ముగుంచుకున్న ఆ జట్టు ఆటగాళ్లు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలను ఆ జట్టు యాజమాన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా మరో వీడియోను కూడా ట్విట్టర్ లో ఆర్సీబీ పోస్ట్ చేసింది. మైదానంలో ఎప్పుడు సీరియస్ గా ఉండే కెప్టెన్ కోహ్లీ అందులో చేసిన అల్లరి మాములుగా లేదు. అయితే ఆ వీడియోలో ఆ జట్టు బౌలింగ్ కోచ్ బౌలర్లందరికి యార్కర్స్ కాంపిటీషన్ పెట్టాడు. అందులో వారికీ పాయింట్స్ కూడా ఉన్నాయి. అలా వారందరు బౌలింగ్ చేస్తుంటే పక్కనే మిగిత ఆటగాళ్లతో కోహ్లీ కూడా ఉన్నాడు. అందులో బౌలర్లు మంచిగా బౌలింగ్ చేస్తే లేచి ఎగరడం లేదంటే సరదాగా వారిని కామెంట్స్ చేస్తూ కనిపించాడు కోహ్లీ. గత 12 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ అందుకొని ఆర్సీబీ ఈ ఐపీఎల్ 13వ సీజన్ లో మొదటి మ్యాచ్ ఈ నెల 21న సన్ రైజర్స్ తో ఆడనుంది.