చెలరేగిన బెంగళూరు.. 200 దాటిన స్కోర్..

చెలరేగిన బెంగళూరు.. 200 దాటిన స్కోర్..

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఆటగాళ్లు రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేశారు దీంతో.. ఆ జట్టు స్కోర్ 200 మార్క్‌ను క్రాస్‌ చేసింది.. టాస్‌ ఓడి బెంగళూరు మొదట బ్యాటింగ్‌ చేయగా...  ఓపెనర్లు  పడిక్కల్‌, ఫించ్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చారు.. ముంబై బౌలర్లను  ధాటిగా ఎదుర్కున్నారు. ఓపెనింగ్‌ జోడీ తొలి వికెట్‌కు  81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.. దేవదత్‌ పడిక్కల్‌ 40 బంతుల్లో  5 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 54 పరుగులు చేసి ఆకట్టుకోగా.. అరోన్‌ ఫించ్ 35 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్స్‌ తో 52 పరుగులు చేశాడు.. ఇక, చివర్లో ఏబీ డివిలియర్స్‌ చెలరేగిపోయాడు.. కేవలం 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.. మరోవైపు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నిరాశపరిచాడు.. ఈ మ్యాచ్‌లో 3 పరుగులు మాత్రమే చేశాడు.. ఇక, శివమ్‌ దూబే 10 బంతుల్లో 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మొత్తానికి మూడు అర్థశతకాలతో.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసిన బెంగళూరు జట్టు.. ముంబై ముందు 202 పరుగుల టార్గెట్‌ పెట్టింది.