తలకిందులు తపస్సు చేసినా ఆర్‌సీబీ టైటిల్ గెలవదు: మైఖెల్ వాన్

తలకిందులు తపస్సు చేసినా ఆర్‌సీబీ టైటిల్ గెలవదు: మైఖెల్ వాన్

ఐపీఎల్ 2020 సీజన్‌లో మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతానికి థర్డ్‌‌ ప్లేస్‌‌లో ఉన్నా.. హైదరాబాద్‌‌, ముంబై మ్యాచ్‌‌ రిజల్ట్‌‌ తర్వాత ఇది మారొచ్చు. అయితే బెంగళూరు లక్కీగా ప్లే ఆఫ్స్ చేరినా టైటిల్ మాత్రం గెలవదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ అన్నాడు. ఆ జట్టుకు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచే సత్తా లేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా క్రిక్‌బజ్‌ తో మాట్లాడుతూ ఆ జట్టు తలకిందులు తపస్సు చేసినా చాంపియన్ కాలేదన్నాడు. ఫస్ట్ నుంచి తాను అదే చెబుతున్నానన్నాడు. ఆర్‌సీబీలో ఫైర్ పవర్ ఉన్న ఆటగాళ్లు లేరని, పైగా ఆ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉందన్నాడు. ఆర్‌సీబీ గెలవాలంటే చేయాల్సింది ఒక్కటే.. దూకుడుగా ఆడుతూ ఆఖరి బంతి వరకు పోరాడాలి' అని వాన్ సూచించాడు.