వ‌డ్డీ రేట్ల‌పై ఆర్బీఐ క్లారిటీ

వ‌డ్డీ రేట్ల‌పై ఆర్బీఐ క్లారిటీ

ఆర్బీఐ ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధాన స‌మీక్షపై ర‌క‌రాల చ‌ర్చ‌లు జ‌రిగాయి.. ఈ సారి కూడా కీల‌క వ‌డ్డీరేట్ల‌ను ఆర్బీఐ త‌గ్గిస్తుంద‌ని ఆర్థిక నిపుణులు అంచ‌నా వేశారు.. దీంతో.. వ‌డ్డీ రేట్లు మ‌రింత త‌గ్గిపోతాయ‌ని లెక్క‌లు వేశారు.. అయితే.. ఇవాళ జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్... కీలక వడ్డీ రేట్లను ఈసారి యథాతథంగానే కొన‌సాగిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో.. రెపో రేటు 4 శాతం, రివ‌ర్స్ రెపో రేటును 3.3 శాతంగానే య‌ధాత‌థంగా కొన‌సాగ‌నున్నాయి. కాగా, రెపోరేటు తగ్గితే.. తద్వారా వచ్చే లబ్ధిని తమ వినియోగదారులకు బదలాయించవచ్చునని బ్యాంకులు ఎదురుచూశాయి.. వ‌డ్డీ రేట్లు త‌గ్గితే.. గృహ, వాహన రుణాలు సహా ఇతర రుణాలపై వడ్డీలు త‌గ్గిపోయి.. ఈఎంఐల భారం త‌గ్గుతుంద‌ని భావించారు.. ఈ సారి వడ్డీరేట్లను ఆర్బీఐ కనీసం 25 బేస్ పాయింట్లు తగ్గిస్తుందని అంచ‌నాలు ఉండ‌గా.. చివ‌ర‌కు ఎలాంటి మార్పులేద‌ని క్లారిటీ ఇచ్చింది ఆర్బీఐ.