ఆర్బీఐ సర్వే.. కుండబద్దలు కొట్టారు..

ఆర్బీఐ సర్వే.. కుండబద్దలు కొట్టారు..

కరోనా మహమ్మారి కారణంగా వ్యవస్థలన్నీ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపైనా వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లుతోందని ఆర్బీఐ సర్వే వెల్లడించింది. దేశంలోని 13 ప్రధాన నగరాల్లో ఆర్బీఐ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం ఆర్థిక సంబంధిత అన్ని అంశాల్లోనూ ఇంకా తిరోగమన పరిస్థితే ప్రస్పుటమైంది. ఉపాధి దెబ్బతిన్నదని 81.7శాతం మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నుంచి అన్‌లాక్‌లోకి అడుగుపట్టిన తర్వాత ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. అయినా, తమ ఆర్థిక పరిస్థితి బాగా లేదని, గత ఏడాదితో పోలిస్తే మరింత దిగజారిందని ప్రజలు చెబుతున్నారు. కన్జూమర్‌ కాన్ఫిడెన్స్‌ సర్వే పేరిట ఆర్బీఐ విడుదల చేసిన సర్వే ప్రకారం తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని కేవలం 9 శాతం మంది మాత్రమే చెప్పారు. సర్వేలో పాల్గొన్న మిగిలిన నెటిజన్లంతా బాగోలేదని, దిగజారిందని, ఏమీ చెప్పలేమని సమాధానాలిచ్చారు. ఆర్బీఐ ఈ సర్వేను హైదరాబాద్‌ సహా దేశంలోని 13 ప్రధాన నగరాల్లో నిర్వహించింది.