లాక్‌డౌన్‌: ఈఎంఐల మారటోరియంపై ఆర్బీఐ క్లారిటీ..

లాక్‌డౌన్‌: ఈఎంఐల మారటోరియంపై ఆర్బీఐ క్లారిటీ..

లాక్ డౌన్ తరుణంలో రుణగ్రహీతలు మూడు నెలల పాటు ఈఎంఐలు చెల్లించనవసరం లేదంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మారటోరియం విధించింది. అయితే, ఈ వెసులుబాటును ఆయా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు  రుణగ్రహీతలు కోరితేనే అమలు చేస్తున్నాయి. అయితే మారటోరియం సదుపాయాన్ని తప్పనిసరిగా అందరు రుణగ్రహీతలకు వర్తింపజేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఓ రుణగ్రహీత తనకు ఈ సౌకర్యం అక్కర్లేదని చెబితేనే అతడ్ని మారటోరియం పరిధి నుంచి తప్పించాలని ఆర్బీఐ ఆదేశించింది.