రాయుడు వచ్చేశాడు..

రాయుడు వచ్చేశాడు..

తెలుగు తేజం అంబటి రాయుడు.. మరోసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆసియా కప్‌ కోసం ఇవాళ సెలెక్టర్లు ప్రకటించిన భారత జట్టులో రాయుడికి చోటు లభించింది. రెండేళ్ల క్రితం జాతీయ జట్టుకు ఆడిన రాయుడి అంతర్జాతీయ కెరీర్‌ ముగిసినట్టే అనుకుంటున్న తరుణంలో ఐపీఎల్‌లో సత్తాచాటడంతో ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. ఐతే..  యో-యో టెస్ట్‌లో విఫలమవడంతో జట్టులో చేరలేకపోయాడు. మరోసారి రీఎంట్రీ కష్టమనుకుంటున్న తరుణంలో.. ఇటీవల బీసీసీఐ నిర్వహించిన యో-యో టెస్టులో పాసైన అంబటి రాయుడు.. ఇండియా-ఎ జట్టుకు ఎంపికై.. రాణించాడు. ఈ క్రమంలో రాయుడిని జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. 2013లో తొలిసారిగా టీమిండియాకు ఎంపికైన రాయుడు 34 వన్డేలు, 6 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించగా చివరి వన్డే 2016, జూన్‌లో ఆడాడు.