ఐదుగురు దర్శకులతో తెరకెక్కిన క్రాక్.. ఎవరెవరంటే..

ఐదుగురు దర్శకులతో తెరకెక్కిన క్రాక్.. ఎవరెవరంటే..

మాస్ మహరాజ రవితేజ చాలా కాలం తర్వాత క్రాక్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఐదుగురు దర్శకులతో రూపొందింది. అదేంటి ఈ సినిమాను గోపీచంద్ మలినేని కదా తెరకెక్కించింది అనుకుంటున్నారా..! అవునండీ నేను చెప్పే ఐదుగురు దర్శకులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అద్భుత ప్రదర్శన చేశాడు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్ ఇందులో హీరోయిన్‌గా అందరిని ఆకట్టుకుంది. అయితే ఇందులో పవర్ ఫుల్ పోలీసోడిని ఢీకొట్టిన పవర్ ఫుల్ విలన్ కటారీ కృష్ణ పాత్రను ప్రముఖ దర్శకుడు సముద్రఖనీ చేశారు. ఇదే విధంగా నీది నాది ఒకే కథ సినిమాతో పేరు తెచ్చుకున్న మరో ప్రముఖ దర్శకుడు దేవీ ప్రసాద్ కూడా ఎస్‌ఐ తిలక్ పాత్రలో అలరించారు. వీరితో పాటు దేనికైనా రెడీ, వాంటెడ్, పాండవులు పాండవులు తుమ్మెదా వంటి సినిమాలను రూపొందించిన బీవీఎస్ రవి కూడా కీలక పాత్రలో కనిపించారు. అక్కినేని నాగచైతన్య హీరోగా బెజవాడ సినిమా చేసిన వివేక్ కృష్ణ పోలీస్ పాత్రలో కనిపించారు. వీరితో పాటుగా ప్రముఖ మూవీ క్రిటిక్, దర్శకుడు మహేష్ కత్తి కూడా ఇందులో కుల సంఘం అధ్యక్షుడిగా కనిపించారు. ఈ రీతిలో ఈ ఐదుగురు దర్శకులతో క్రాక్ సినిమా రూపొందింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవిహారం చేస్తోంది.