భారత్ లో నిర్వహిస్తున్న సిఎస్కే క్యాంప్ కు జడేజా దూరం...

భారత్ లో నిర్వహిస్తున్న సిఎస్కే క్యాంప్ కు జడేజా దూరం...

ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం అవుతుంది. దానికోసం ఆటగాళ్లు ఆగస్టు 21 న దుబాయ్ కి బయలుదేరనున్నారు. అయితే ఐపీఎల్ లోని మిగిత అన్ని జట్లు అక్కడికి వెళ్లిన తర్వాత శిక్షణ శిబిరాలను నిర్వహించనుండగా చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఆగస్టు 15 నుంచి 20 మధ్య ఆరు రోజుల శిక్షణ శిబిరాన్ని భారత్ లోనే ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఇప్పటికే ఆటగాళ్లు కూడా చెన్నై చేరుకున్నారు. కానీ సిఎస్కే జట్టులో ముఖ్యమైన ఆటగాడు రవీంద్ర జడేజా మాత్రం ఇందులో పాల్గొనడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆ జట్టు సీఈఓ విశ్వనాథన్‌ వెల్లడించారు. అయితే ఎందుకు అనే కారణాలు మాత్రం చెప్పలేదు కానీ అతను నేరుగా దుబాయ్ కి వెళ్లేముందు జట్టుతో కలుస్తాడు అని తెలిపాడు. ఈ రోజు రైనా తో పాటుగా సిఎస్కే ఆటగాళ్లు దీపక్ చాహర్, బరీందర్ శ్రాన్, పియూష్ చావ్లా, ధోని ఈ శిక్షణ శిబిరానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని రైనా తెలుపుతూ తన సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్న మొదటి మ్యాచ్ తో ఐపీఎల్ 2020 ప్రారంభం అవుతుంది.