మాస్ రాజా 67 మూవీ అప్‌డేట్‌..!

మాస్ రాజా 67 మూవీ అప్‌డేట్‌..!

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం తనకు ' డాన్‌శీను, బలుపు’ వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన గోపీచంద్ మలినేని తో 'క్రాక్' అనే సినిమా చేస్తున్నాడు. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పూర్తి కాగానే రమేశ్‌ వర్మ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. రవి తేజ కెరియర్లోఇది 67 వ సినిమా. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండటంతో... డింపుల్ హయాతి, మీనాక్షి చౌధురిని తీసుకున్నారు.ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు రమేశ్‌ వర్మ అధికారిక ప్రకటన చేశారు. రేపు ఉదయం 11 గంటల 55 నిమిషాలకు ముహూర్తం, ఫస్ట్‌లుక్‌ వివరాలను తెలియజేస్తామనిడైరెక్టర్‌ తెలిపారు. ఏ స్టూడియోస్‌ ఎల్‌ఎల్‌పీ, పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై సినిమా రూపొందనుంది.