పోలీసులకు లొంగిపోయిన కూన రవి కుమార్‌

పోలీసులకు లొంగిపోయిన కూన రవి కుమార్‌

మూడ్రోజులుగా కన్పించకుండాపోయిన ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ కూన రవికుమార్‌ పోలీసుల ముందు లొంగిపోయారు. పొందూరు తహసీల్దార్ రామకృష్ణను బెదిరించిన కేసులో పోలీసుల ముందు హాజరయ్యారు. పొందూరు మండలం రామసాగరంలో అక్రమంగా మట్టి తవ్వుతున్నారంటూ ఫిర్యాదు రావడంతో తహసిల్దార్‌ రామకృష్ణ...నాలుగు లారీలు సీజ్ చేశారు. ఐతే తన సోదరుడికి చెందిన లారీలను సీజ్ చేసి రెండురోజులైనా కేసు నమోదు చేయకపోవడంతో కూనరవి రంగంలోకి దిగారు . మే18న తహసీల్దార్ రామకృష్ణకు ఫోన్ చేసి తమకు చెందిన వాహనాల పై ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు . కేసు నమోదు చేయకపోతే ...లంచం అడుగుతున్నావని కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని బెదిరించారు . ఈక్రమంలో తహసీల్దార్ పై కూన నోరు పారేసుకున్నారు .

రూల్స్ తెలియదంటూ... నోటికొచ్చిన బూతులు తిట్టారు . ఒకవేళ కేసులు పెట్టే ఉద్ధేశం లేకపోతే ... ఎంత లంచం కావాలో అడిగితే అంతా ఇస్తా అంటూ ఆఫర్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినందుకు , బెదిరించినందుకుగానూ 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పొందూరు పోలీసులు. కూన అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు . ఐతే అప్పటికే కూనరవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో మే 25న తెల్లవారు జామున శ్రీకాకుళం...శాంతినగర్ కాలనీలో ఉన్న కూన ఇంటికి వెళ్లిన పోలీసులు అతని కోసం ఇల్లంతా వెతికారు. కూన ఎక్కడా కనిపించకపోవడంతో వెనుదిరిగారు.  ఈ క్రమంలో మూడు రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్న ఆయన ఈ రోజు పోలీసులకు స్వయంగా లొంగిపోవడం జరిగింది.