ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక ఉత్సవానికి రతన్‌ టాటా

ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక ఉత్సవానికి రతన్‌ టాటా

ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్‌ అధినేత రతన్‌ టాటా వచ్చే నెల నాగ్‌పూర్‌లో జరిగే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) కీలక ఉత్సవానికి హాజరు కానున్నారు. సంఘ్‌ శిక్షా వర్గా పేరుతో జరిగే మూడేళ్ళ శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా రతన్‌ టాటా పాల్గొంటారు.  గత ఏడాది ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి హాజరయ్యారు. జూన్‌లో జరిగే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఆర్ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో రతన్‌ టాటా భేటీ అవుతారు. గతంలో నాగ్‌పూర్‌కు రతన్‌ టాటా రెండుసార్లు వచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన కార్యక్రమం భగవత్‌, రతన్‌ టాటా పాల్గొనడం నాలుగోసారి అవుతుంది.