బాలీవుడ్ నటుడి కొడుకుపై లైంగికదాడి కేసు

బాలీవుడ్ నటుడి కొడుకుపై లైంగికదాడి కేసు

బాలీవుడ్ సీనియర్ నటుడు మిథిన్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ చక్రవర్తిపై లైంగికదాడి కేసు నమోదు అయ్యింది. తనను వివాహం చేసుకుంటానన్ని ప్రమాణం చేసి తనతో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహాక్షయ పై ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది బాధితురాలు. తాను మహాక్షయ నాలుగేండ్ల పాటు సహజీవనం చేశామని ఆమె చెప్పుకొచ్చింది. అనంతరం పెళ్లి మాట ఎత్తితే తనను మానసికంగా శారీరికంగా అనేక ఇబ్బందులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. గర్భం దాల్చడంతో బలవంతంగా తనకు అబార్షన్‌ చేయించారని, కేసు పెడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని మహాక్షయ తల్లి యోగితా బాలి కూడా తనను బెదిరించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా అతడిపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి . రెండేండ్ల క్రితం  భోజ్‌పురి నటిని పెండ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి లైంగికదాడి, గర్భస్రావం చేసినట్లు మహాక్షయపై ఆరోపణలు వచ్చాయి.