ఏపీలో మరో కీచక కాండ.. 8 ఏళ్ల బాలిక మీద !

ఏపీలో మరో కీచక కాండ.. 8 ఏళ్ల బాలిక మీద !

మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఒక ప్రార్థనాస్థలంలో చదువుకోవడానికి వచ్చిన బాలికపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు మణప్పురం ఫైనాన్స్‌ ఆఫీస్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న జగదీష్‌. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో జరిగింది. హిందూపురం క్రాసింగ్‌ దగ్గరున్న ప్రార్థనాస్థలంలో చదువుకోవడానికి 8 ఏళ్ల బాలిక వెళ్లింది. అయితే జగదీష్‌ చర్యల నుంచి బాలిక తప్పించుకుని జరిగిన ఉదంతాన్ని  కుటుంబసభ్యులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. జగదీష్‌పై ఫోక్సో చట్టం కింద కేసు పెట్టినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. అయితే  నిందితుడిని పట్టుకున్నారని ప్రచారం జరగడంతో అతడిని అప్పగించాలని బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అప్రమత్తంగా ఉండి ,వారందరిని బైటికి పంపివేశారు పోలీసులు.