బాలీవుడ్ స్టార్స్ కోసం ‘దీప్ వీర్‘ ముంబై రిసెప్షన్

బాలీవుడ్ స్టార్స్ కోసం ‘దీప్ వీర్‘ ముంబై రిసెప్షన్

నవంబర్ 14, 15న ఇటలీలోని లేక్ కోమోలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు బాలీవుడ్ హాట్ పెయిర్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకోన్. ఈ పవర్ కపుల్ ఇవాళ ముంబైలో తమ మూడో పెళ్లి రిసెప్షన్ ఇస్తున్నారు. గ్రాండ్ హయత్ హోటల్ లో కేవలం బాలీవుడ్ స్టార్స్ కోసమే ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ రిసెప్షన్ పార్టీకి సెలబ్రిటీలంతా హాజరవుతున్నారు. దీప్ వీర్ తమకు ఆప్తులైన నటీనటులు, సాంకేతిక నిపుణులందరినీ ఆహ్వానించినట్టు తెలిసింది. ఈ పార్టీకి వేసుకోబోయే డ్రెస్సుల్లో రణ్ వీర్, దీపికా ఫోజులిచ్చిన ఫోటోలను దీప్స్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

pic.twitter.com/V3NWLAcYSA