కరీనా కపూర్ సెకండ్ బేబీ ఫస్ట్ ఫోటో...!?

కరీనా కపూర్ సెకండ్ బేబీ ఫస్ట్ ఫోటో...!?

బెబో కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ దంపతులు ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ రెండవ బిడ్డకు స్వాగతం పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీనా తన రెండవ బిడ్డ ముఖాన్ని కవర్ చేస్తూ ఒక పిక్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో కరీనా సెకండ్ బేబీని చూడాలన్న ఆతృత ప్రతి ఒక్కరిలో మొదలైంది. తాజాగా కరీనా తండ్రి, ప్రముఖ నటుడు రణధీర్ కపూర్ ఓ పిక్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సోమవారం నాడు రణధీర్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు పక్క పక్కనే ఉన్న ఇద్దరు శిశువుల క్లోజప్ పిక్ ని షేర్ చేశారు. వారిలో ఒకరు తైమూర్ లాగా ఉండగా, మరొక బిడ్డ బెబోకు రెండవ సంతానం. అందులో ఇద్దరు చిన్న నవాబులు ఒకేలా కన్పిస్తున్నారు. అయితే కాసేపటికే రణధీర్ ఆ పోస్ట్ ను తొలగించారు. దీంతో నెటిజన్లు ఆ పిక్ లో ఉన్నది కరీనా సెకండ్ బేబీనా కదా అనే డైలామాలో పడ్డారు. ఆయన అలా ఎందుకు చేశారో తెలియదు కానీ ఆ పిక్ క్షణాల్లో వైరల్ అయ్యింది. అయితే ఇంతకుముందు రణధీర్... కరీనా సెకండ్ బేబీ తన అన్నయ్య తైమూర్ లాగా కనిపిస్తుందని చెప్పడం గమనార్హం. కాగా కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ దంపతులు న్యూ బార్న్ బేబీ పేరును ఇంకా వెల్లడించలేదు. ఇక కరీనా కపూర్ మొదటి కుమారుడు తైమూర్ అలీఖాన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.