పెళ్లికి రెడీ అయిన రన్బీర్, అలియా !

పెళ్లికి రెడీ అయిన రన్బీర్, అలియా !

బాలీవుడ్ ప్రేమ జంట రన్బీర్ కపూర్, అలియా త్వరలో ఒక్కటవ్వబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.  ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్ళికి డేట్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నారట.  రన్బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ ప్రస్తుతం అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారు.  అది మార్చి నెలాఖరుకు పూర్తవుతుంది. 

ఆయన తిరిగి ముంబై వచ్చిన వెంటనే ఏప్రిల్ నెలలో పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారట.  చాలా రోజుల నుండి ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ బహిరంగంగానే తమ ప్రేమను అంగీకరించారు.  ప్రస్తుతం ఇద్దరూ కలిసి 'బ్రహ్మాస్త్ర' అనే సినిమా చేస్తున్నారు.