వేసవిలో విరాటపర్వం..

వేసవిలో విరాటపర్వం..

టాలీవుడ్ భళ్లాలదేవుడు రానా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. అతడు నటించిన అనేక సినిమాలు చాలా వైవిధ్యమైన కథలే. అటువంటిదే మరో కథతో మనముందుకు అతి త్వరలోనే రానున్నారట. రానా, సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా భారీ అంచనాలతో ముందుకు సాగుతోంది. ఈ సినిమా నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కడం దీనికి ఉన్న మరో ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈ చిత్రం సురేష్ బాబు సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్రరా సినిమాస్, సురేష్ ప్రొడక్షన్ బ్యనర్‌లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదలై ప్రచార చిత్రాలు తారాస్థాయిలో స్సందన పొందాయి. ఇక సినిమా నుంచి విడుదలైన రానా ఫస్ట్ గ్లింప్స్ వైరల్ అయింది. ఇందులో ప్రయమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వాహెబ్, సాయి చంద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాకుండా తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ విడుదలైంది. ఈ ఫోటో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు రానా, సాయి పల్లవి ఫోటోలు విడివిడిగా ఉన్నవే విడుదలయ్యాయి. ఈ సారి మాత్రం అభిమాలకు సంక్రాంతి కానుకగా వీరిద్దరు కలిసి ఉన్న సోస్టర్‌ను చిత్ర టీం రిలీజ్ చేసింది. అయితే అంతా బాగుంది కాని సినిమా థియేటర్లలో సందడి చేసేది ఎప్పుడని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ సినిమా విడుదలపై మేకర్స్ స్పందించారు. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాతో అభిమానుల అంచనాలను అందుకుందో లేదో వేచి చూడాల్సిందే.