తారక్ సినిమాలో ఆ సీనియర్ నటి

తారక్ సినిమాలో ఆ సీనియర్ నటి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం  దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది . ఈ సినిమాలో తారక్ గిరిజన వీరుడు కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. ఇక ఇదే సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమా సీనియర్ నటి నటించనున్నట్టు తెలుస్తుంది. త్రివిక్రమ్ గత సినిమాల్లో నదియా , టబు , ఖుష్బూ  ఇలా సీనియర్ హీరోయిన్స్ ను కీలక పాత్రల్లో నటింపజేశాడు. ఇప్పడు తారక్ తో చేయబోయే సినిమాలోనూ ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి రమ్యకృష్ణను తీసుకొస్తున్నట్టు టాక్. బాహుబలి సినిమాలో శివగామిగా అలరించిన రమ్యకృష్ణ ఆతర్వాత పలు సినిమాల్లో నటించారు. తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.