రామ్ చరణ్‌కి రాజమౌళి నో రెస్ట్..?

రామ్ చరణ్‌కి రాజమౌళి నో రెస్ట్..?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఒకవైపు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. మరోవైపు కొరటాల శివ, చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తుండగా ఎన్‌టీఆర్ గొండు వీరుడు కొమరం భీమ్‌గా చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్ నుంచి బ్రేక్ తీసుకొని ఆచార్య సినిమా చిత్రీకరణలో చేరారు. ఆచార్య సినిమాలో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ‘సిద్ధ’ అనే పాత్రలో చెర్రీ కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రి మారేడుమిల్లి అడవుల్లో జరిగింది. ఆచార్య సినిమా చిత్రీకరణ ముగించుకున్న వెంటనే చెర్రీ మళ్లీ ఆర్ఆర్ఆర్ చిత్రీకరణలో చేరారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దాంతో సినిమాను పూర్తి చేయడానికి పెద్దగా సమయం లేకపోవడంతో రాజమౌళి చెర్రీకి విశ్రాంతి ఇవ్వడం లేదని సమాచారం. అయితే బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అందరికీ తెలుగు సినిమా సత్తా చూపించిన రాజమౌళి ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందా అని దేశమంతా ఆత్రుతగా ఎదురుచూస్తోంది.