అయోధ్యలో మోడీ మొక్క నాటిన స్థలానికి... మొదటి స్వతంత్ర సంగ్రామానికి లింక్ ఉందా?

అయోధ్యలో మోడీ మొక్క నాటిన స్థలానికి... మొదటి స్వతంత్ర సంగ్రామానికి లింక్ ఉందా?

ఆగష్టు 5 వ తేదీన ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సంబంధించిన భూమిపూజలో పాల్గొన్నారు.  అదే రోజున రామాలయం ఆవరణలో మోడీ పారిజాతం మొక్కను నాటారు.  పారిజాతం మొక్క నాటిన స్థలానికి చరిత్ర పరంగా ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తోంది.  దేశంలో 1857 వ సంవత్సరంలో మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగింది.  ఆ సమయంలో అయోధ్యకు చెందిన బాబా రామ్ చరణ్ దాస్, అమీర్ ఆలీ అనే ఇద్దరు స్థానికులు బ్రిటీషర్లకు వ్యతిరేకంగా అయోధ్య నుంచి పోరాటం చేశారు.  దీంతో బ్రిటిష్ ప్రభుత్వం వీరిద్దరిని పట్టుకొని ఆలయ ప్రాంగణంలో ఉన్న చింత చెట్టుకు ఉరేసి చంపింది.  వీరిద్దరి త్యాగాలను గుర్తిస్తూ, అప్పటి ప్రజలు చింత చెట్టుకు పూజలు చేయడం మొదలుపెట్టారు.  వారి స్పూర్తితో అనేకమంది బ్రిటీషర్ల వ్యతిరేకంగా పోరాటం చేయడం మొదలుపెట్టారు.  దీంతో అప్పటి ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ నికల్సన్ ఆ చింత చెట్టును కూకటివేళ్లతో సహా పీకేయించాడు.  చెట్టు లేకపోయినా ఆ భూమిని అయోధ్య ప్రజలు పవిత్రంగా పూజిస్తున్నారు.  ఆ భూమిలోనే ప్రధాని మోడీ పారిజాతం మొక్కను నాటారని అమృత లాల్ నగర్ అనే రచయిత పేర్కొన్నారు. అమృత్ లాల్ నగర్ తన గదర్ కే పూల్ అనే పుస్తకంలో శ్రీరామజన్మభూమికి, మొదటి స్వాతంత్ర ఉద్యమానికి ఉన్న సంబంధం గురించి పేర్కొన్నారు.