తప్పులు జరగడం సహజం: రామ్

తప్పులు జరగడం సహజం: రామ్

రామ్ పోతినేని ప్రతి విషయాన్ని స్పోర్టివ్‌గా తీసుకుంటాడు. అతడు ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉంటాడు. అందరితో స్నేహంగా మెలుగుతాడు. ప్రతి ఒక్కరితో కలిసిపోతుంటాడు. అయితే ఇటీవల రామ్ నటించిన రెడ్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రెడ్ టీజ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిన్న జరుపుకుంది. ఈ వేడుకకు అనేక మంది సినీ ప్రముఖులు వీచ్చేసి అలరించారు. ప్రముఖుల రాకతో ఈ ఈవెంట్ చాలా అట్టహాసంగా జరిగింది. అయితే ఇందులో చోటుచేసుకున్న ఓ తప్పిదం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కూడా ముఖ్య అతిథికి ఫస్ట్ డే ఫస్ట్‌ షో బిగ్ టికెట్‌ను అందించడం ఆనవాయితీ. అదేవిధంగా రెడ్ ప్రీరిలీజ్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన త్రివిక్రమ్‌కి ఈ టికెట్‌ను ఇచ్చారు. కానీ ఈ టికెట్‌కు ఉన్న కవర్‌ను త్రివిక్రమ్ తీయగానే అందరిలోను ఆశ్యర్యం. ఎందుకంటే అది క్రాక్ సినిమా టికెట్. జనవరి 9 డేట్‌తో ఆ టికెట్ ఉంది. వెంటనే తప్పును గమనించిన ఈవెంట్ ఆర్గపైజ్ సంస్థ దాన్ని క్రాక్ పేరుపై రెడ్ స్టిక్కర్ అంటించి ఇచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ట్రోలింగ్ జరిగింది. దీనిపై హీరో రామ్ స్పందించారు. ‘ఈ ఈవెంట్‌ను మరుపురాని జ్ఞాపకంగా మార్చినందుకు కృతజ్ఞతలు. అభిమానులకు ఎల్లప్పుడు నెను రుణపడిఉంటాను. మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఎప్పుడూ సంతోషాన్ని కలిగిస్తోంది. మీడియా వారికి కూడా నా కృతజ్ఞతలు. ఇక పోతే శ్రేయాష్ శ్రీనివాస్ అప్పుడుప్పుడు తప్పులు జరుగుతుంటాయి.. ఏం పర్వాలేదు. అవేం పట్టించుకోకండి. మీరే బెస్ట్ చీర్స్’ అని ట్వీట్ చేశాడు. వెంటనే శ్రేయాష్ శ్రీనివాస్ రామ్ ట్వీట్‌కు స్పందించాడు. రెడ్ సినిమాలో భాగం కావడం మాకు చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు. తన ట్వీట్‌తో హీరో రామ్ మరోసారి తన పాజిటివ్ నెస్ చూపించాడు.